ఇండోనేషియా గుహల్లో 45 వేల సంవత్సరాల నాటి ప్రాచీన చిత్రం గుర్తింపు
- 2017లో ఇండోనేషియా గుహల్లో పరిశోధన
- అడవి పంది బొమ్మను గుర్తించిన పరిశోధక విద్యార్థి
- తాజాగా ఓ సైన్స్ జర్నల్ లో వెల్లడి
- ఇంకా పురాతనమైనది కావొచ్చన్న ఆస్ట్రేలియా నిపుణుడు
ఈ గుహలను లియాండ్ తెడోంగ్నే గుహలుగా పేర్కొంటారు. సున్నపురాయి కొండలుండే ప్రాంతంలోని మారుమూల లోయలో ఈ గుహ ఉంది. ఈ గుహ వద్దకు వర్షాకాలంలో వెళ్లడం అసాధ్యం. ఎందుకంటే, కొండకోనల్లో పొంగిపొరలే వాగులు, సెలయేళ్లతో అక్కడ వరద వాతావరణం ఉంటుంది. అందుకే, ఎండాకాలంలోనే గుహ వద్దకు వెళ్లే వీలుంటుంది.
కాగా, ఈ గుహలో గుర్తించిన అడవి పంది బొమ్మ 45,000 సంవత్సరాల నాటి మానవుడు గీసి ఉంటాడని మాక్సిమే ఆబెర్ట్ వెల్లడించారు. ఈ బొమ్మ పై భాగంలో పేరుకుపోయిన కాల్సైట్ పదార్థాన్ని విశ్లేషించడం ద్వారా బొమ్మ కాలాన్ని అంచనా వేశామని, వాస్తవానికి ఆ బొమ్మ ఇంకా పురాతనమైనదని భావిస్తున్నామని ఆబెర్ట్ వివరించారు.