అఖిల ప్రియ‌కు బేగంపేట పీహెచ్‌సీలో క‌రోనా ప‌రీక్ష‌లు

14-01-2021 Thu 12:35
  • బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో విచార‌ణ‌
  • ముగిసిన పోలీసు క‌స్ట‌డీ
  • జ‌డ్జి ముందు హాజ‌రు ప‌ర్చ‌నున్న పోలీసులు
Akhila Priya Went For A Coronavirus Test

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో పోలీసుల‌ విచార‌ణ ఎదుర్కొంటోన్న ఏపీ మాజీ ‌మంత్రి అఖిల ప్రియ పోలీస్‌ కస్టడీ ముగిసింది. ఆమెను బేగంపేటలోని పీహెచ్ సీకి త‌ర‌లించిన పోలీసులు ఆమెకు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించి, గాంధీ ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్క‌డ‌ ఆమెకు వైద్య పరీక్షలు చేయ‌నున్నారు.

కాసేప‌ట్లో ఆమెను జడ్జి ముందు హాజరపర్చుతారు. అనంత‌రం  చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. విచార‌ణ‌లో భాగంగా అఖిలప్రియను పోలీసులు మొత్తం 300 ప్రశ్నలు అడిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితులు భార్గవ్‌రామ్‌, చంద్రహాస్‌, గుంటూరు శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.