Amitabh Bachchan: భార‌త క్రికెట‌ర్లంద‌రికీ అమ్మాయిలే పుడుతున్నారంటూ అమితాబ్ ట్వీట్.. నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు

they will become women cricketers says amitab
  • కోహ్లీకి ఇటీవ‌లే కూతురు
  • ఇత‌ర క్రికెట‌ర్లకూ ఆడ‌పిల్ల‌లే పుట్టార‌న్న బిగ్ బీ 
  • వీరంతా భ‌విష్య‌త్తులో మ‌హిళా క్రికెట్ టీమ్ గా మార‌తార‌ని వ్యాఖ్య‌
  • అందులో ధోనీ కూతురు కెప్టెనా?  అంటూ ట్వీట్  
భార‌త క్రికెట‌ర్లంద‌రికీ అమ్మాయిలే పుడుతున్నారంటూ బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ చేసిన‌ ట్వీట్ వైరల్ అవుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇటీవ‌లే కూతురు పుట్టిన విష‌యం విదిత‌మే. ఈ నేపథ్యంలోనే బిగ్ బీ దీనిపై స్పందించారు.

భార‌త మాజీ, ప్ర‌స్తుత‌ క్రికెట‌ర్లు రైనా, గంభీర్‌, రోహిత్ శ‌ర్మ‌,  ష‌మి, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, భ‌జ్జీ, న‌ట‌రాజ‌న్‌, ఉమేశ్ యాద‌వ్‌లంద‌రికీ కూతుళ్లే పుట్టార‌ని బిగ్ బీ పేర్కొన్నారు. వీళ్లంతా భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తారా? అని ట్వీట్ చేశారు.  అందులో ధోనీ కూతురు కెప్టెన్‌గా ఉంటుందేమో అంటూ చమత్కరించారు. దీంతో అమితాబ్ పై కొంద‌రు నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.
Amitabh Bachchan
Bollywood
Cricket
Virat Kohli

More Telugu News