Nizamabad District: నిజామాబాద్ లో 1,500 కోళ్లు మృతి

  • దేశ వ్యాప్తంగా బ‌‌ర్డ్ ఫ్లూ భ‌యం
  • నిజామాబాద్ లోనూ క‌ల‌క‌లం
  • చ‌నిపోయిన‌ కోళ్లను పూడ్చిపెట్టిన సిబ్బంది
  • న‌మూనాలు హైద‌రాబాద్ కు త‌ర‌లింపు   
1500 chickens die in nizamabad

భార‌త్ లోని ప‌లు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా బ‌‌ర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యూపీ‌, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, గుజరాత్, మ‌హారాష్ట్ర‌ల్లో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ప‌లు రాష్ట్రాల్లో ఉన్న‌ట్టుండి పెద్ద ఎత్తున కాకులు, కోళ్లు మృతి చెందుతుండడం క‌ల‌కలం రేపుతోంది.

ఇప్పుడు తెలంగాణ‌లోని  నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం యానంపల్లి తండా శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లోనూ పెద్ద ఎత్తున కోళ్లు మృతి చెంద‌డం గ‌మ‌నార్హం. 24 గంటల్లో దాదాపు 1,500 కోళ్లు మృతి చెందాయి. ఓ పౌల్ట్రీ ఫామ్ య‌జ‌మాని రెండు షెడ్లలో 8,000 కోళ్లను పెంచుతుండ‌గా వాటిలో 1,500 కోళ్లు ఒక్క‌సారిగా చ‌నిపోయాయ‌ని చెప్పాడు.  

దీంతో చ‌నిపోయిన‌ కోళ్లను అటవీ ప్రాంతంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. దీంతో ఆ పౌల్ట్రీ ఫామ్ కు చేరుకున్న అధికారులు వివ‌రాలు సేక‌రించారు. అక్కడి కోళ్ల రక్త నమూనాలను, మృతి చెందిన ఓ కోడిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం త‌ర‌లించారు. అయితే, మృతి చెందిన కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు అంటున్నారు.

More Telugu News