ప్ర‌ముఖుల సంక్రాంతి శుభాకాంక్ష‌లు!

14-01-2021 Thu 11:07
  • ప్ర‌జ‌లంతా సుఖ, సంతోషాల‌తో జీవించాలి:  కేసీఆర్‌
  • సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలి: చిరు
  • అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: నాగార్జున 
happy sankranti wishes from kcr chiru

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. 'తెలంగాణ రాష్ట్రం సిరి, సంప‌ద‌ల‌తో, భోగ భాగ్యాల‌తో విల‌సిల్లాల‌ని ఆకాంక్షిస్తూ.. ప్ర‌జ‌లంతా సుఖ, సంతోషాల‌తో జీవించేలా దీవించాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ.. సంక్రాంతి పండుగ‌ను ఆనందంగా జ‌రుపుకోవాల‌ని కోరుకుంటూ.. ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు' అంటూ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు.

'అందరికీ సంక్రాంతి  శుభాకాంక్షలు. భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అంటూ సినీనటుడు చిరంజీవి ట్వీట్ చేశారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాన‌ని నాగార్జున చెప్పారు.

'మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరినీ దేవుడు చల్లగా చూడాలి' అంటూ విక్ట‌రీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. 'భోగ భాగ్యాల‌నిచ్చే భోగి, స‌ర‌దానిచ్చే సంక్రాంతి, క‌మ్మ‌ని క‌నుమ‌, కొత్త ఏడాది కొత్త వెలుగులు నింపాల‌ని కోరుకుంటూ ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు' అని విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు.

'మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాధ్యతగా. క్షేమంగా ఉండాలి' అని మహేశ్ బాబు పేర్కొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతున్నాన‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.