సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

14-01-2021 Thu 07:26
  • హైవే మీద సైక్లింగ్ చేసిన రకుల్ 
  • పక్కా ప్లానింగ్ తో సెట్స్ కి 'ఎఫ్ 3'
  • చైతు సినిమా విడుదలకు ముహూర్తం
Rakul cycles a long way to sets

*  కథానాయికలంతా ఫిట్ నెస్ కోసం ఎంతో శ్రమిస్తూ వుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే.. రోజూ జిమ్ లో గంటలతరబడి వర్కౌట్స్ చేస్తుంది. అంతేకాదు, ఇప్పుడు తను షూటింగుకి 12 కిలోమీటర్ల దూరంలోని సెట్స్ కి ఉదయాన్నే హైవే మీదుగా సైకిల్ తొక్కుతూ వెళ్లిందట. టైమ్ మేనేజ్ మెంటులో భాగంగా ఇలా సైకిల్ మీద వెళ్లానని ఈ చిన్నది సోషల్ మీడియాలో పేర్కొంది.  
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా గతంలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రూపొందుతున్న సంగతి విదితమే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగును ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తిచేసేలా షెడ్యూల్స్ వేశారట. అలాగే చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేస్తారు.
*  నాగ చైతన్య, పూజ హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాన్ని మే 11న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.