హిందీలో నాకు మార్కెట్ ఉండటం ఆనందకరం: రామ్

13-01-2021 Wed 21:57
  • రామ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడంటూ ప్రచారం
  • ఇప్పట్లో హిందీ సినిమా చేసే ఆలోచన లేదన్న రామ్
  • తెలుగులో మరిన్ని సినిమాలు చేయడమే తన లక్ష్యమని వ్యాఖ్య
Happy to have market in Hindi says Actor Ram

టాలీవుడ్ హీరో రామ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై రామ్ స్పందించాడు. తనకు హిందీలో కూడా మార్కెట్ ఉండటం సంతోషంగా ఉందని అన్నాడు. అయితే ఇప్పట్లో హిందీ సినిమా చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. తెలుగుతో మరిన్ని సినిమాలు చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని చెప్పాడు. మరోవైపు రామ్ తాజా చిత్రం 'రెడ్' సంక్రాంతి కానుకగా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.