రానా 'విరాటపర్వం' నుంచి మరో పోస్టర్ విడుదల

13-01-2021 Wed 14:49
  • యథార్థ సంఘటనల నేపథ్యంలో 'విరాటపర్వం'
  • మావోయిస్టుగా నటిస్తున్న రానా దగ్గుబాటి
  • సంక్రాంతి సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల
  • వేసవిలో థియేటర్లకు వస్తున్న సినిమా  
Another Poster from Ranas Virataparvam movie out

మావోయిస్టు ఉద్యమం నేపథ్యంలో.. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'విరాటపర్వం'. రానా మావోయిస్టుగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది.

గతంలో రానా జన్మదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం విదితమే. ఇప్పుడు సంక్రాంతి పర్వదినం సందర్భంగా నేడు మరో పోస్టర్ ను యూనిట్ విడుదల చేసింది.

మావోయిస్టు యూనిఫామ్ లో వున్న రానా చేయిని పట్టుకున్న సాయిపల్లవి.. ఇద్దరూ ఆనందంతో నవ్వుతూ.. నడుచుకుంటూ వస్తున్న ఫొటోతో కూడిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వేసవిలో ఈ చిత్రం థియేటర్లకు వస్తున్నట్టుగా అందులో ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.