చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించిన రోజా

13-01-2021 Wed 14:41
  • చంద్రబాబు కడుపులో మంటలు వేసుకుంటున్నారు
  • చంద్రబాబు చాలా దిగజారి పోయారు
  • జగన్ పాలనలో అందరూ హాయిగా ఉన్నారు
Roja fires on Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజలంతా భోగి మంటలు వేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపులో మంటలు వేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు మంచి చేసేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా జీవోలను తెచ్చిందని, వాటిని భోగి మంటల్లో తగులబెట్టాలని చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందని అన్నారు. రైతే రాజు అనే విధంగా రైతు అడిగినవి, అడగనివి కూడా చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. జగన్ పాలనలో ప్రజలంతా హాయిగా ఉన్నారని చెప్పారు.