Steve Smith: ఇండియా ఆడిన అద్భుత ఆటను వదిలేసి ఈ నిందలా?: ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్!

  • పంత్ గార్డ్ మార్క్ ను చెరిపేశాడని ఆరోపణలు
  • అందులో వివాదమేమీ లేదన్న స్మిత్
  • వెనకేసుకొచ్చిన కెప్టెన్ టిమ్ పైనీ
Steve Smith Denied Cheating in third Test

ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడవ టెస్ట్ లో నెలకొన్న వివాదాలపై ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్పందించాడు. అశ్విన్ పై నిందలేయడం, రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గార్డ్ మార్క్ ను చెరిపేశాడంటూ తనపై వచ్చిన విమర్శలకు వివరణ ఇచ్చాడు. ఈ విషయంలో వివాదమే లేదని స్మిత్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఈ ఆరోపణలు తనను నిర్ఘాంత పరిచాయని పేర్కొన్న స్మిత్, తనకు చాలా నిరాశ కలిగిందని అన్నాడు. మామూలుగా పిచ్ వద్దకు వెళ్లి తమ బౌలర్లు ఎక్కడ బంతులు వేస్తున్నారన్న విషయాన్ని గమనిస్తుంటానని, అదే సమయంలో ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఆడుతున్నారన్న విషయాన్ని పరిశీలిస్తానని, తాను అక్కడే ఉండి ఆడితే ఎలా ఉంటుందని పరిశీలించే క్రమంలోనే ఆ ఘటన జరిగిందని స్పష్టం చేశాడు.

తాను అప్రయత్నంగా మిడిల్ స్టంప్ కు మార్కింగ్ తీసుకున్నానే తప్ప, మరే తప్పు చేయలేదని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో ఇండియా ఆటగాళ్లు చేసిన అద్భుత ప్రదర్శనను వదిలేసి, ప్రాధాన్యత లేని ఇంటువంటి విషయాలను పెద్దవి చేసి చూపడం సిగ్గు చేటని అన్నారు.

కాగా, స్మిత్ చేసిన పనిని కెప్టెన్ టిమ్ పైన్ సైతం సమర్ధించాడు. స్మిత్ ఆటను చూసిన వారు ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని, నిజంగా పంత్ మార్కింగ్ ను అతను చెరిపివేయలేదని అన్నాడు. తాను మైదానంలో అశ్విన్ తో వ్యవహరించిన తీరుపై క్షమాపణలు కోరానని గుర్తుచేస్తూనే, తాను కెప్టెన్ గా విఫలమయ్యానే తప్ప, స్మిత్ చేసిన పనిని వ్యతిరేకించబోనని అన్నాడు.

More Telugu News