ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి మీ జంట ఆదర్శంగా నిలిచింది: సునీత దంపతులకు నాగ‌బాబు విషెస్

13-01-2021 Wed 10:45
  • ఆనందం అనేది పుట్టుకతో రాదు
  • దానిని మనం వెతికి అందుకోవాలి
  • రామ్, సునీత అన్వేషించి గుర్తించారు
nagababu wishes sunitha

మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనితో సింగ‌ర్ సునీత వివాహం  ఇటీవ‌ల‌ జరిగిన విష‌యం తెలిసిందే. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో వీరి వివాహం జ‌రిగింది. ఈ సందర్భంగా సునీతకు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. తాజాగా, సినీన‌టుడు నాగ‌బాబు వారి పెళ్లిపై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆనందం అనేది పుట్టుకతో రాదని, దానిని మనం వెతికి అందుకోవాలని నాగ‌బాబు ట్వీట్ చేశారు. రామ్, సునీత తమ సంతోషాలను అన్వేషించి గుర్తించినందుకు  అభినందనలు చెబుతున్నాన‌ని అన్నారు. ధైర్యంగా ముందడుగు వేయాలనుకునేవారికి వారి జంట ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రేమ, ఆనందం అనేవి ఎప్పటికీ వారి శాశ్వ‌త చిరునామాగా మారాలని కోరుకుంటున్నానని చెబుతూ, వారికి వివాహ శుభాకాంక్ష‌లు తెలిపారు.