అమెరికాలో కరోనా స్ట్రెయిన్ ఉద్ధృతి: అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు

13-01-2021 Wed 06:36
  • అమెరికాలో పెరుగుతున్న కొత్త స్ట్రెయిన్ కేసులు
  • అన్ని దేశాల ప్రయాణికులపైనా ఆంక్షలు
  • త్వరలో ఉత్తర్వులు విడుదల చేయనున్న సీడీసీ
America to extend restrictions to all passengers

అమెరికాలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను పొడిగించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులపైనే ఆంక్షలు ఉండగా, ఇక నుంచి అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనా ఆంక్షలు విధించబోతోంది. ఇకపై అమెరికా రావాలనుకునే వారు తమకు కరోనా లేదని నిర్ధారించే టెస్టు రిపోర్టును చూపించాల్సి ఉంటుంది.

26 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా, అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సీడీసీ ఉత్తర్వులు అమలులోకి వస్తే.. ఇతర దేశాల పౌరులతోపాటు, ఆయా దేశాలకు వెళ్లి తిరిగి అమెరికాకు వచ్చే సొంత దేశ పౌరులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి.