పవన్ సినిమాకి ఓకే చెప్పిన సాయిపల్లవి!

12-01-2021 Tue 20:57
  • ఈ రోజు క్రిష్ సినిమా మొదలెట్టిన పవన్ 
  • వచ్చే నెల నుంచి 'అయ్యప్పనుమ్..' రీమేక్
  • ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ నిడివి పెంపు
  • మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి    
Sai Pallavi gives nod for Pawan Kalyans film

ఇటీవలే 'వకీల్ సాబ్' చిత్రం షూటింగును పూర్తిచేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఇతర చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఈ రోజు క్రిష్ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగును ఈ రోజు మొదలెట్టారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక దీని తర్వాత మలయాళ రీమేక్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ చేస్తారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగును వచ్చే నెల నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మరో హీరో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు.

ఇదిలావుంచితే, ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ కోసం సాయిపల్లవిని అడిగినట్టూ, ఆమె తిరస్కరించినట్టూ ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, సాయిపల్లవి ఈ ప్రాజక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఒరిజినల్ వెర్షన్ లోని పాత్రకు మరిన్ని మార్పులు చేసి, పాత్ర నిడివి పెంచి, పవర్ ఫుల్ గా డిజైన్ చేయడంతో సాయిపల్లవి ఈ చిత్రం చేయడానికి ఓకే చెప్పినట్టు చెబుతున్నారు.