ఏపీలో మరింత తగ్గిన కరోనా కేసులు.. అప్ డేట్స్ ఇవిగో!

12-01-2021 Tue 20:24
  • 24 గంటల్లో 197 కొత్త కేసుల నమోదు
  • ఇదే సమయంలో ఇద్దరి మృతి
  • ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 2,411
Corona cases in AP decreased drastically

ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో 40,986 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా... 197 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో కరోనా వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు.

ఇదే సమయంలో 234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు 8,85,234 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 7,133 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 1,23,96,593 శాంపిల్స్ ని పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,411 యాక్టివ్ కేసులు ఉన్నాయి.