యువతకు జగన్ పెద్దపీట వేస్తున్నారు: అవంతి శ్రీనివాస్

12-01-2021 Tue 16:03
  • యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది
  • ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం
  • యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఏం చేయడానికైనా సీఎం సిద్ధంగా ఉన్నారు
Jagan taking care of youth development says Avanthi Srinivas

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. యువతకు అవకాశాలను కల్పిస్తే వారు అద్భుతాలను సృష్టిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ యువతకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

విశాఖలోని ఉడా చిల్ట్రెన్ థియేటర్ లో ఈరోజు జాతీయ యువజన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతితో పాటు ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ఏం చేయడానికైనా ముఖ్యమంత్రి వెనుకాడరని అన్నారు.