మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా జోష్.. వీడియో ఇదిగో

12-01-2021 Tue 13:29
  • నిన్న మ్యాచ్ ను డ్రాగా ముగిసేలా చేసిన హ‌నుమ విహారి, అశ్విన్
  • తోటి ఆట‌గాళ్ల నుంచి ప్ర‌శంస‌లు
  • హ‌నుమ విహారి, అశ్విన్ ల‌కు నెటిజ‌న్ల అభినంద‌న‌లు
team india mood in dressing room

సిడ్నీలో భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య  జ‌రిగిన‌ మూడో టెస్టు మ్యాచు డ్రాగా ముగిసిన విష‌యం తెలిసిందే. చివ‌రి రోజు ఆస్ట్రేలియాను గెల‌వ‌నివ్వ‌కుండా భార‌త మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్ మెన్ హ‌నుమ విహారి, అశ్విన్ చేసిన కృషిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. వారిద్ద‌రూ మ్యాచు చివ‌రి వ‌ర‌కు పూర్తిగా డిఫెన్స్ ఆడి డ్రాగా ముగిసేలా చేశారు.

ఈ నేప‌థ్యంలో డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిన అనంత‌రం వారిద్ద‌రు ఏం చేశారు? వారికి తోటి ఆట‌గాళ్లు ఎలా శుభాకాంక్ష‌లు తెలిపారు? అన్న విషయాల‌ను వీడియో రూపంలో టీమిండియా క్రికెట్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. టీమిండియా చివ‌రి రోజు ఆడిన తీరుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. హ‌నుమ విహారి, అశ్విన్ లను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.