హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసిన జగన్

12-01-2021 Tue 13:31
  • విజయవాడకు వచ్చిన గవర్నర్ దత్తాత్రేయ 
  • సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం
  • అంతకు ముందు దత్తాత్రేయను కలిసిన డీజీపీ
Jagan meets HP Governor Bandaru Dattatreya

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఏపీ ముఖ్యమంత్రి జగన్ కలుసుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు దత్తాత్రేయ విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను జగన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దత్తాత్రేయకు పుష్పగుచ్ఛం అందించారు. సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా దత్తాత్రేయను కలిశారు. అంతకుముందు దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంలో ఆయనను సత్కరించారు.

అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దత్తాత్రేయ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదపండితులు వేదాశీర్వచనాలను  అందించారు.