ఇది సహించరాని విషయం: ఏపీ స‌ర్కారుపై సోమిరెడ్డి ఆగ్ర‌హం

12-01-2021 Tue 11:41
  • బడుగు బలహీనవర్గాల వారితో పాటు దళితులను వేధిస్తున్నారు
  • చివరకు దివ్యాంగులపైనా ప్రతాపం చూపుతున్నారు
  • ఉపాధి కల్పిస్తున్న టీకొట్టును కూల్చి కక్ష సాధిస్తారా?
somireddy slams ap govt

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ నేత‌లు చివ‌ర‌కు దివ్యాంగుల ప‌ట్ల కూడా దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

'బడుగు బలహీనవర్గాల వారితో పాటు దళితులను వేధిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చివరకు దివ్యాంగులపైనా ప్రతాపం చూపుతుండటం దుర్మార్గం. వారిపై కనికరం చూపాల్సిందిపోయి ఉపాధి కల్పిస్తున్న టీకొట్టును కూల్చి కక్ష సాధిస్తారా?' అని సోమిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.
 
'వెంకటాచలం మండలం కాకుటూరులో ఇళ్ల స్థలాల పంపిణీలో అక్రమాలను ప్రశ్నించిన దళిత దివ్యాంగుడు ఆత్మకూరు ఇమాన్యుయేల్ పై కక్ష సాధింపు దారుణం. మొన్న వావిలేటిపాడు.. నిన్న అక్కంపేటలో దళితుల భూములపై పడ్డారు.. నేడు కాకుటూరులో ఏకంగా వారి పొట్టే కొట్టారు. ఇది సహించరాని విషయం' అని సోమిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.