విడుదలకు ఒకరోజు ముందే లీక్ అయిన విజయ్ 'మాస్టర్'!

12-01-2021 Tue 10:51
  • 13న విడుదల కావాల్సిన చిత్రం
  • లీక్ అయిన సీన్లను స్టేటస్ గా పెట్టుకుంటున్న ఫ్యాన్స్
  • దయచేసి షేర్ చేయవద్దన్న డైరెక్టర్
Vijay Staring MASTER Seanes Leaked online

రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం 'మాస్టర్' ఒరిజినల్ కాపీ ఆన్ లైన్ లో విడుదలై నిర్మాతలకు షాకిచ్చింది. భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదల కానుండగా, మొత్తం సీన్లతో సినిమా లీక్ అయింది. నిన్నటి నుంచి ఇవి సోషల్ మీడియాలో వైరల్ కాగా, పలువురు తమ స్టాటస్ మెసేజ్ లుగా వీటిని పెడుతుండటంతో సినిమా యూనిట్ అప్రమత్తమైంది. తమకు జరుగుతున్న నష్టంపై చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించి, మాస్టర్ ను మీ ముందుకు తెస్తున్నాం. ఈ సినిమాను థియేటర్లలోనే చూసి ఆనందించాలని మేము కోరుతున్నాం. మీ వద్దకు లీక్ అయిన దృశ్యాలు వస్తే వాటిని దయచేసి షేర్ చేయకండి. విడుదలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది" అని తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ కనకరాజ్ వ్యాఖ్యానించారు.