క‌ల్తీ మద్యం తాగి మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 11 మంది మృతి

12-01-2021 Tue 09:37
  • మోరెనా జిల్లాలో ఘ‌ట‌న‌
  • మ‌రికొందరికి తీవ్ర అస్వ‌స్థత‌
  • బాధితులు చెహ్రా మాన్‌పూర్, పెహ్‌వాలీ ప్రాంతాల‌కు చెందిన  వారు
Toxic liquor kills 11 in Madhya Pradeshs Morena district

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. బాధితులు చెహ్రా మాన్‌పూర్, పెహ్‌వాలీ ప్రాంతాల‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో గ‌త ఏడాది  అక్టోబరులో కూడా కల్తీ మద్యం కార‌ణంగా 15 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న మ‌ర‌వక ముందే మ‌రోసారి అటువంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో క‌ల్తీ మ‌ద్యం అనేక ప్రాంతాల్లో ల‌భ్య‌మ‌వుతున్న‌ప్ప‌టికీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.