విర్రవీగకు నేస్తమా... జంటకు ముందుంది ముసళ్ల పండుగ: వర్ల రామయ్య

11-01-2021 Mon 19:51
  • పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేసిన హైకోర్టు
  • నిమ్మగడ్డపై సెటైర్ వేసిన విజయసాయి
  • శకునిలా వికటాట్టహాసం చేశాడంటూ వర్ల వ్యాఖ్యలు
  • అంత మిడిసిపాటు పనికిరాదని హితవు
Varla Ramaiah reacts to Viajayasai Reddy remarks on Nimmagadda

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు వ్యంగ్యం ప్రదర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇస్తే... ఏ2 విజయసాయిరెడ్డి అట్టహాసం ఆనాటి మయసభలో జూద విజయం తర్వాత శకుని చేసిన వికటాట్టహాసంలా ఉందని పేర్కొన్నారు. "విర్రవీగకు నేస్తమా... ముందుంది జంటకు ముసళ్ల పండుగ. మీరు క్రమం తప్పకుండా కోర్టుకు హాజరవ్వండి చాలు, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు. మిడిసిపడడం మంచిది కాదు" అంటూ వర్ల రామయ్య హితవు పలికారు.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు సస్పెండ్ చేసిన నేపథ్యంలో, విజయసాయిరెడ్డి స్పందిస్తూ... నిమ్మగడ్డ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళతారా లేక చంద్రబాబు ఇంటికి వెళతారా? అంటూ ఎద్దేవా చేయడం తెలిసిందే.