ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి మరో టైటిల్?

11-01-2021 Mon 19:31
'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా 
'అయినను పోయిరావలె హస్తినకు' వర్కింగ్ టైటిల్
తాజాగా 'చౌడప్ప నాయుడు' టైటిల్ పరిశీలన     
Title considered for NTR film

స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ నిర్ణయించడం ఆయా దర్శక నిర్మాతలకు పెద్ద కసరత్తు లాంటిది. ఆయా హీరోల ఇమేజ్ కు తగ్గట్టుగా అది సెట్ అవ్వాలి. అప్పుడే అభిమానులకు హుషారుగా ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన నటించే చిత్రానికి ఓ పవర్ ఫుల్ టైటిల్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే 'చౌడప్ప నాయుడు'!

 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. గత కొంత కాలంగా దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొదట్లో దీనికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే వర్కింగ్ టైటిల్ని అనుకున్నారు. అయితే, తాజాగా కథకు సూటయ్యేలా మరింత పవర్ ఫుల్ గా ఉండేలా 'చౌడప్ప నాయుడు' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతుందనేది త్వరలోనే తెలుస్తుంది.