హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిమ్మగడ్డపై సెటైర్ వేసిన విజయసాయిరెడ్డి

11-01-2021 Mon 17:17
  • స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసిన కోర్టు
  • నిమ్మగడ్డ గారూ సుప్రీంకు వెళతారా అంటూ విజయసాయి వ్యంగ్యం
  • లేక,చంద్రబాబు ఇంటికి వెళతారా అంటూ వ్యాఖ్యలు
  • దయచేసి చెప్పండి అంటూ ట్వీట్
Vijaysai Reddy satires on SEC Nimmagadda Ramesh Kumar

ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. పంచాయతీ ఎన్నికలు జరపాలన్న పట్టుదలతో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై సెటైర్ వేశారు. "అయ్యా నిమ్మగడ్డ గారూ... హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారా లేక చంద్రబాబు ఇంటికి వెళతారా..? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "చెప్పండి ప్లీజ్..!" అంటూ ట్వీట్ చేశారు.

అంతకుముందు విజయసాయి.... టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహాభారతంలో సైంధవుని పాత్రే ఇప్పటి ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబు పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. సైంధవుడు అన్నింటికీ అడ్డం పడతాడని, అయితే అది తాత్కాలికమేనని తెలిపారు. ఎందరు సైంధవులు వచ్చినా సంక్షేమ మహాయజ్ఞం ఆగదని స్పష్టం చేశారు. సైంధవ సంహారం కోసం అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించాడని, చంద్రబాబుపై జనం ప్రజాస్వామ్య అస్త్ర ప్రయోగం తప్పదని హెచ్చరించారు.