Virat Kohli: తండ్రి అయిన విరాట్ కోహ్లీ

Virat Kohli becomes father
  • పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ
  • ఈ మధ్యాహ్నం బిడ్డ పుట్టిందని ట్విట్టర్ ద్వారా తెలిపిన కోహ్లీ
  • తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ట్వీట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. అతని భార్య అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కోహ్లీ వెల్లడించాడు. ఈ మధ్యాహ్నం తమకు బిడ్డ పుట్టిందనే విషయాన్ని మీకు తెలియజేయడానికి ఎంతో థ్రిల్ ఫీలవుతున్నానని కోహ్లీ ట్వీట్ చేశాడు. మీ అందరి ప్రేమాభిమానాలకు, ప్రార్థనలకు, విషెస్ కు ధన్యవాదాలు అని తెలిపాడు.

అనుష్క, పాప ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. తల్లిదండ్రులుగా తామిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఈ సమయంలో తమకు కొంత ప్రైవసీ కావాలని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరాడు. మరోవైపు తల్లిదండ్రులైన కోహ్లీ, అనుష్కలకు అభిమానుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Virat Kohli
Anushka Sharma
Team India
Father
Daughter

More Telugu News