సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ... సీఎం జగన్ ఆస్తుల కేసులో కీలక నిర్ణయం తీసుకున్న కోర్టు

11-01-2021 Mon 16:36
  • కొనసాగుతున్న సీఎం జగన్ ఆస్తుల కేసుల విచారణ
  • ఇవాళ విచారణ చేపట్టిన సీబీఐ-ఈడీ కోర్టు
  • మొదట సీబీఐ చార్జిషీట్ల సంగతి తేల్చాలన్న సీఎం జగన్ న్యాయవాదులు
  • తాము ఈడీ కేసులే మొదట విచారిస్తామన్న కోర్టు
Court decides to separation of CBI and ED cases

గత కొంతకాలంగా సీఎం జగన్ ఆస్తులపై సీబీఐ, ఈడీ కేసుల విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులను విచారిస్తున్న సీబీఐ-ఈడీ కోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ జరుపుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ సందర్భంగా సీఎం జగన్ తరఫు న్యాయవాదులకు ఓ అంశంలో చుక్కెదురైంది.

సీబీఐ చార్జిషీట్ల సంగతి తేలిన తర్వాతే ఈడీ కేసులు విచారించాలని జగన్ న్యాయవాదులు కోర్టును కోరారు. అందుకు కోర్టు నిరాకరించింది. సీబీఐ అభియోగాలకు, ఈడీ అభియోగాలకు సంబంధంలేదని, ఈడీ కేసులనే తాము ముందుగా విచారిస్తామని స్పష్టం చేసింది. ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.