Uttam Kumar Reddy: బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందం బట్టబయలైంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలకు కేసీఆర్ జై కొడుతున్నారు
  • గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్టు వీరి తీరు ఉంది
  • సాగర్ లో జానారెడ్డిని గెలిపించుకోవాలి
BJP and TRS dark deal exposed says Uttam Kumar Reddy

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తోందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి నాశనం చేస్తోందని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ దుర్మార్గమైన పాలన చేస్తున్నారని విమర్శించారు. రైతులు పండించే ప్రతి పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాల ద్వారానే కొనుగోలు జరగాలని అన్నారు. పంట ఉత్పత్తులను కొనుగోలు చేసేంత వరకు తాము పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం బట్టబయలైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. గల్లీమే కుస్తీ, ఢిల్లీమే దోస్తీ అన్నట్టుగా ఈ పార్టీల వ్యవహారం ఉందని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవ కోసం జానారెడ్డి పాటుపడ్డారని... అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు.

More Telugu News