రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై వేటు... క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఎస్ఈసీ

11-01-2021 Mon 14:10
  • పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కీలక చర్యలు
  • 30 రోజుల సెలవుపై వెళ్లాడంటూ జేడీపై ఆరోపణలు
  • ఇతర ఉద్యోగులను కూడా సెలవుకు ప్రోత్సహిస్తున్నాడన్న ఎస్ఈసీ
  • విధుల నుంచి తొలగిస్తూ తాజాగా నిర్ణయం
SEC takes disciplinary actions against JD GV Saiprasad

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం తమ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించింది. ఎన్నికల సంఘం జేడీ జీవీ సాయిప్రసాద్ పై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 30 రోజుల సెలవుపై వెళ్లడమే కాకుండా, ఇతర ఉద్యోగులను కూడా సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని సాయిప్రసాద్ పై ఆరోపణలు ఉన్నాయి.

ఎస్ఈసీ దీన్ని క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించారు. ముఖ్యంగా, ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా సాయిప్రసాద్ చర్యలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం అతడిని విధుల నుంచి తొలగిస్తున్నామని ఎస్ఈసీ తాజాగా ప్రకటించారు. ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే వీల్లేదని స్పష్టం చేశారు.