మైదానంలో తన బుద్ధిని బ‌య‌ట‌పెట్టి స్టంప్స్ కెమెరాకు దొరికిపోయిన ఆసీస్ క్రికెట‌ర్ స్మిత్!

11-01-2021 Mon 13:28
  • సిడ్నీ టెస్టులో భార‌త్ ను ఓడించ‌లేక‌పోయిన ఆసీస్
  • 97 ప‌రుగులు చేసిన పంత్
  • స్టీవ్ స్మిత్ మ‌రోసారి త‌న తీరును బ‌‌యట‌పెట్టిన వైనం
  • డ్రింక్స్ బ్రేక్‌లో పంత్ గార్డ్‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా చెరిపేసిన స్మిత్
Aussie comes to shadow bat and scuffs out the batsmens guard marks

సిడ్నీ టెస్టులో భార‌త్ ను ఆస్ట్రేలియా ఓడించ‌లేక‌పోయిన విష‌యం తెలిసిందే. క్రీజులో హ‌నుమ విహారి, అశ్విన్ ప‌ట్టుద‌ల‌తో వికెట్ ప‌డిపోకుండా ఆడి మ్యాచును డ్రాగా ముగిసేలా చేశారు. అయితే, తాము గెలిచే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఈ రోజు మ్యాచు జ‌రుగుతోన్న స‌మ‌యంలో ఆస్ట్రేలియా కొత్త కొత్త ఎత్తుగ‌డ‌లు వేసింది.  

గ‌తంలో బాల్ టాంప‌రింగ్‌లో దొరికిపోయిన  స్టీవ్ స్మిత్  మ‌రోసారి త‌న తీరును బ‌‌యట‌పెట్టాడు. చివ‌రి రోజు మ్యాచులో రిష‌బ్ పంత్  97 ప‌రుగులు చేశాడు. అత‌డి ఆట‌తీరుకి భ‌య‌ప‌డిపోయిన
స్మిత్  డ్రింక్స్ బ్రేక్‌లో  పంత్ గార్డ్‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా చెరిపేశాడు. అయితే, స్టంప్స్ కెమెరాకు దొరికిపోయాడు. అనంత‌రం పంత్ మ‌రోసారి గార్డ్ ను మార్క్ చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను టీమిండియా అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు.