ఐదున్నర ల‌క్ష‌ల విలువైన షూస్ వేసుకున్న హీరో ఫొటో వైర‌ల్!

11-01-2021 Mon 13:19
  • ఎయిర్ పోర్టులో  క‌న‌ప‌డ్డ బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్
  • బ్లూజీన్స్‌ ధరించి, చేతిలో బ్యాగ్
  • బ్యాగ్ ఖ‌రీదూ రూ.ల‌క్ష
Ranbir Wore A Pricey Pair Of White Sneakers With Heels

సాధార‌ణంగా మనం వేసుకునే బూట్ల ఖ‌రీదు ఎంత ఉంటుంది.. రూ.300 నుంచి మ‌హా అయితే, రూ.10 వేలు ఉంటుంది. అయితే,  దాదాపు ఐదున్నర లక్షల రూపాయల ఖ‌రీదైన షూస్ వేసుకుని బాలీవుడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ ఎయిర్ పోర్టులో క‌న‌ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.‌

బ్లూజీన్స్‌ ధరించి, చేతిలో బ్యాగ్‌తో ఆయ‌న అక్క‌డ కనపడ్డాడు. నైకి అండ్‌ డియోర్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌గా వచ్చిన ఈ స్నీకర్స్ ను 8,000 జతలు మాత్ర‌మే తయారు చేసింది. ఒకజతను కొన్న ర‌ణ్‌బీర్ క‌పూర్ వాటిని ఇప్పుడు వేసుకున్నాడు. అంతేకాదు, ఆయ‌న బ్యాగు ఖ‌రీదు కూడా లక్ష రూపాయలు ఉంటుంద‌ని తెలిసింది.