రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ నేతలను తరిమికొట్టాలి: సోము వీర్రాజు

11-01-2021 Mon 13:15
  • లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది
  • అప్పులు చేసి అమ్మఒడి ఇస్తున్నారు
  • ఇళ్లపట్టాల భూసేకరణలో రూ. 3 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుంది
YSRCP leaders destroying the state says Somu Veerraju

ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లోకి నెట్టేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. లక్షల కోట్ల అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టి అమ్మఒడి ఇస్తున్నారని దుయ్యబట్టారు. అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తే, రాష్ట్రం పూర్తిగా నాశనమవుతుందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న వైసీపీ నేతలను తరిమికొట్టాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టే ఇళ్లన్నీ కేంద్రం ఇచ్చిన నిధులతోనే అని అన్నారు. ఇళ్ల పట్టాల భూసేకరణలో రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు వైసీపీకి, టీడీపీకి లేదని అన్నారు. తిరుపతిలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.