Amitabh Bachchan: ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగేలా చేశారు: టీమిండియాకు అమితాబ్ అభినందనలు

Amitab Bachchan hails Team India effort to draw Sydney test
  • డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు
  • అద్భుతంగా ఆడిన విహారి, అశ్విన్
  • పొగడ్తల జల్లు కురిపించిన బిగ్ బి
  • అత్యంత కష్టసాధ్యమైన స్థితిలో పోరాడారని కితాబు
సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో అద్వితీయ పోరాటపటిమ కనబర్చిన భారత జట్టు డ్రా చేసుకుంది. గెలుపు ఆశల నుంచి ఓటమి ప్రమాదంలోకి జారుకున్న టీమిండియాను హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ జోడీ ఆదుకున్న తీరు టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ పోరాటాల్లో ఒకటిగా నిలుస్తుంది.

దీనిపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. అత్యంత కష్టసాధ్యమైన పరిస్థితుల్లో మ్యాచ్ ను డ్రాగా ముగించారని అభినందించారు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుత ప్రదర్శన చేశారని కితాబునిచ్చారు. గాయాల బెడద, జాత్యహంకార దూషణల పర్వం కలిగించిన విసుగు నుంచి ఉపశమనం కలిగిస్తూ మ్యాచ్ ను సురక్షితంగా ముగించారని అమితాబ్ కొనియాడారు. 'టీమిండియా... నువ్వు అత్యంత దృఢవైఖరి కనబర్చావు... ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో ఉప్పొంగేలా చేశావు' అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Amitabh Bachchan
Draw
Sydney Test
Team India

More Telugu News