Australia: డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు.. పూర్తిగా డిఫెన్స్ ఆడిన హ‌నుమ విహారి, అశ్విన్

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సు 338
  • రెండో ఇన్నింగ్సులో 312/6 ప‌రుగులు
  • భార‌త్ తొలి ఇన్నింగ్సులో 244
  • రెండో ఇన్నింగ్సులో 334/5
sidney Match drawn

సిడ్నీలో భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య  జ‌రుగుతోన్న మూడో టెస్టు మ్యాచు డ్రాగా ముగిసింది. చివ‌రి రోజు భార‌త్ ఐదు వికెట్లు కోల్పోయిన త‌ర్వాత గెలిచే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో వికెట్ కాపాడుకోవ‌డానికే భార‌త్  ప్రాధాన్య‌త ఇచ్చింది. క్రీజులో హ‌నుమ విహారి, అశ్విన్ ఇదే ప్ర‌య‌త్నం చేశారు. వారిద్ద‌రూ పూర్తిగా డిఫెన్స్ ఆడి మ్యాచ్ డ్రాగా ముగిసేలా చేశారు. ఈ క్ర‌మంలో దాదాపు 240 బంతుల్లో వారు 50 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని మాత్ర‌మే నెల‌కొల్ప‌డం గ‌మ‌నార్హం.

నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్ లో ఇప్ప‌టివ‌ర‌కు మూడు ముగిశాయి. 1-1తో ఇరు జ‌ట్లు స‌మంగా నిలిచాయి. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 338కు ఆలౌటైన విష‌యం తెలిసిందే. రెండో ఇన్నింగ్సులో ఆరు వికెట్ల న‌ష్టానికి 312 ప‌రుగులు చేసి డిక్లేర్ చేసింది.

భార‌త్ తొలి ఇన్నింగ్సులో 244కే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్సులో ఐదో రోజు 98/2 ఓవ‌ర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భార‌త్ ఐదు వికెట్ల నష్టానికి 334 ప‌రుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో రోహిత్ శ‌ర్మ 52, శుభ్ మ‌న్ గిల్ 31, పుజారా 77, ర‌హానె 4, రిష‌బ్ పంత్ 97, హ‌నుమ విహారి 23 (నాటౌట్) , ర‌వి  చంద్రన్ అశ్విన్  39 (నాటౌట్) ప‌రుగులు చేశారు. రెండో ఇన్నింగ్సులో ఆసీస్ బౌల‌ర్ల‌లో జోష్ , లైయ‌న్ ల‌కు చెరో రెండు వికెట్లు, క‌మ్మిన్స్ కు ఒక వికెట్టు దక్కాయి. 

More Telugu News