మంత్రులు, క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ

11-01-2021 Mon 12:22
  • రెవెన్యూ, విద్యాసంబంధిత అంశాల‌పై చ‌ర్చ‌
  • కరోనా వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డి, వ్యాక్సిన్ పంపిణీపై నిర్ణ‌యాలు
  • పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై స‌మీక్ష‌
  • బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చ‌
kcr to take few decisions

మంత్రులు, అధికారులు, ప‌లు శాఖల అధికారుల‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో స‌మావేశ‌మ‌య్యారు. రెవెన్యూ, విద్యాసంబంధిత అంశాల‌తో పాటు  తెలంగాణ‌ కరోనా వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డి, వ్యాక్సిన్ పంపిణీపై కీల‌క చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

అలాగే, రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై కూడా ఆయ‌న సమీక్షించనున్నారు. ఆయా  కార్యక్రమాల అమలును అడిగి తెలుసుకుంటారు. పెండింగ్ లో ఉన్న‌ మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ వంటి అంశాల‌పై చ‌ర్చ జ‌రుపుతారు. తెలంగాణ‌లో 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ సమావేశాలపై మంత్రులు, కలెక్టర్ల ఈ సమావేశంలోనే కేసీఆర్‌ చర్చించి తేదీలను ఖరారు చేసే అవ‌కాశం ఉంది.