Sachin Tendulkar: భార‌త క్రికెట‌ర్ల‌పై జాత్య‌హంకార వ్యాఖ్య‌ల పట్ల స‌చిన్ మండిపాటు!

sachin fires on australia cricket fans
  • సిరాజ్, బుమ్రాలపై‌ జాత్యహంకార వ్యాఖ్య‌లు
  • ఆస్ట్రేలియా ప్రేక్ష‌కుల తీరుపై విమ‌ర్శ‌లు
  • ఆటలు అందరినీ కలుపుతాయి.. విడ‌దీయ‌వ‌న్న స‌చిన్
  • ఆటగాళ్ల జాతి, రంగు, మతాల‌తో సంబంధం లేదని వ్యాఖ్య
సిడ్నీలో ఆస్ట్రేలియా-టీమిండియా మ‌ధ్య జ‌రుగుతోన్న‌ టెస్టు మ్యాచ్ ను చూడ‌డానికి వ‌చ్చిన కొంద‌రు ప్రేక్ష‌కులు భార‌త‌ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై‌ జాత్యహంకార వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా రెండో రోజు కూడా సిరాజ్ పై మ‌రికొంద‌రు ఇటువంటి వ్యాఖ్య‌లే చేయ‌డం గ‌మ‌నార్హం.

దీనిపై టీమిండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ స్పందించారు. ఆటలు అందరినీ కలుపుతాయని, అంతేగానీ మనుషులను విడదీయబోవని తెలిపారు. క్రికెట్ ఎన్న‌డూ వివక్ష చూపబోదని, ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే చూస్తుందని అన్నారు. ఆట‌లో ఆటగాళ్ల జాతి, రంగు, మతాల‌తో సంబంధం లేదని, దీన్ని అర్థం చేసుకోని వారికి క్రీడా రంగంలో కొనసాగే అర్హత లేదని తెలిపారు.
Sachin Tendulkar
Cricket
siraj

More Telugu News