ఆగివున్న లారీని ఢీకొన్న సానియా మీర్జా భర్త షోయబ్ కారు!

11-01-2021 Mon 09:16
  • వేగంగా వెళుతున్న కారుకు ప్రమాదం
  • తాను క్షేమంగానే ఉన్నానన్న మాలిక్
  • దేవుని దయతో బయటపడ్డానని వ్యాఖ్య 
Shoaib Malik Car Accident

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగివున్న లారీని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో మాలిక్ కారు పూర్తిగా ధ్వంసం కాగా, మాలిక్ స్వల్ప గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారు.

ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన మాలిక్, దేవుని దయతోనే బయటపడ్డానని అన్నారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలిపారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు, స్నేహితులు తనపై చూపుతున్న ప్రేమ, ఆప్యాయతలకు ధన్యవాదాలు చెప్పాడు.