Polio sunday: కరోనా వ్యాక్సినేషన్ ఎఫెక్ట్.. పోలియో టీకా పంపిణీ వాయిదా

Polio Vaccination Drive Postponed by Center
  • 17న ‘పోలియో ఆదివారం’
  • వరుస కార్యక్రమాలతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రభావం
  • పోలియో ఆదివారాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించని కేంద్రం
ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుండడంతో 17న నిర్వహించతలపెట్టిన పోలియో టీకా పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. 16న కరోనా వ్యాక్సినేషన్‌లో పాల్గొనే వైద్య సిబ్బంది ఆ తర్వాతి రోజే పోలియో టీకా పంపిణీలో పాల్గొని, ఆ మరుసటి రోజు మళ్లీ కరోనా టీకా పంపిణీలో పాల్గొనడం కష్టం అవుతుందని, అలా చేస్తే ఆ ప్రభావం వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై పడుతుందని భావించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

16న వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, 17న టీకాల పంపిణీకి సెలవు ప్రకటించారు. 18 నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. కరోనా వ్యాక్సినేషన్ కోసం అన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఆసుపత్రులను కూడా ఎంపిక చేశాయి. టీకా నిల్వల కోసం పటిష్ఠ చర్యలు తీసుకున్నాయి. నేడు ఆయా రాష్ట్రాలకు కరోనా టీకా సరఫరా కానుంది.
Polio sunday
Corona Vaccination
postponed

More Telugu News