పెరిగిన తిరుమల రద్దీ... రూ. 3 కోట్లు దాటిన హుండీ ఆదాయం!

11-01-2021 Mon 09:02
  • స్వామిని దర్శించుకున్న 37,849 మంది
  • హుండీ ద్వారా రూ. 3.06 కోట్ల ఆదాయం
  • కరోనా నిబంధనలు పాటిస్తున్నామన్న టీటీడీ
Rush in Tirumala

శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల గిరుల్లో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. నిన్న ఆదివారం నాడు స్వామివారిని 37,849 మంది భక్తులు దర్శించుకున్నారని, 15,338 మంది తలనీలాలు సమర్పించారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో హుండీ ద్వారా రూ. 3.06 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. వారాంతం కావడంతోనే రద్దీ పెరిగిందని, భక్తులు కరోనా నిబంధనలను పాటిస్తూ, స్వామిని దర్శించుకునేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ వారంలో సంక్రాంతి పర్వదినాలు రానున్నందున రద్దీ కొంతమేరకు తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.