Corona Vaccination: తెలంగాణలో 18 వ తేదీ నుంచి పెరగనున్న టీకా పంపిణీ కేంద్రాలు

  • ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్
  • తొలి రోజు తెలంగాణలో 139 కేంద్రాలు
  • 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి 1400 కేంద్రాలు
  • 16న గాంధీ ఆసుపత్రి వైద్యులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
From 18th Onwards Covid Centers in Telangana will be Increased

దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. టీకా పంపిణీ కోసం తెలంగాణలో తొలి రోజున 139 కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో 40 ప్రైవేటు, 99 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 13, మేడ్చల్‌లో 11, రంగారెడ్డిలో 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న 16న ప్రధాని నరేంద్రమోదీ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని పీహెచ్‌సీ వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు.

17న టీకా పంపిణీకి సెలవు కాగా, 18న తిరిగి ప్రక్రియ మొదలవుతుంది. ఆ రోజు నుంచి పంపిణీ కేంద్రాలను పెంచనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1200 ఆసుపత్రులలో 1400 కేంద్రాల ద్వారా టీకాలు వేస్తారు. గాంధీ, ఉస్మానియా, వరంగల్‌లోని ఎంజీఎం వంటి పెద్దాసుపత్రులలో నాలుగు కేంద్రాలను పెంచనున్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో 170 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతారు. 500 మందికిపైగా సిబ్బంది ఉన్న ప్రైవేటు ఆసుపత్రులలో టీకా కేంద్రాల సంఖ్యను పెంచనుండగా, 100 మందికిపైగా సిబ్బంది ఉన్న కేంద్రాల్లో టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News