Turlapaty Kutumba Rao: ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత

  • అస్వస్థతతో రాత్రి పది గంటల సమయంలో ఆసుపత్రిలో చేరిక
  • చికిత్స పొందుతుండగా గుండెపోటు
  • 2002లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న తుర్లపాటి 
Turlapaty Kutumba Rao Passes Away

ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా, అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.  

1946లో 14 సంవత్సరాల వయసులోనే తుర్లపాటి పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. పాత్రికేయుడిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సభాధ్యక్షుడిగా, అనువాద ప్రసంగికునిగా ప్రసిద్ధికెక్కారు. మొత్తంగా 18 మంది ముఖ్యమంత్రుల వద్ద ఆయన పనిచేశారు. 2002లో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఫలితంగా ఆ ఘనత సాధించిన తొలి తెలుగు పాత్రికేయుడిగా రికార్డులకెక్కారు.

More Telugu News