ఏపీ కరోనా అప్ డేట్: విశాఖలో ఒకరి మృతి

10-01-2021 Sun 18:43
  • గత 24 గంటల్లో 50,027 కరోనా టెస్టులు
  • 227 మందికి పాజిటివ్
  • అత్యధికంగా గుంటూరు జిల్లాలో 50 కేసులు
  • అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 5 కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 2,544
One corona death registers in Visakhapatnam districts

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఈ మరణం విశాఖ జిల్లాలో నమోదైంది. దాంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 7,129కి చేరింది. అదే సమయంలో రాష్ట్రంలో 50,027 కరోనా టెస్టులు నిర్వహించగా 227 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 50 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 38, కర్నూలు జిల్లాలో 23 కేసులు వెల్లడయ్యాయి.

అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 7, విజయనగరం జిల్లాలో 8 కేసులు వచ్చాయి. తాజాగా 289 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,84,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,75,243 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,544 మందికి చికిత్స జరుగుతోంది.