ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మాజీ మంత్రి సోమిరెడ్డి

10-01-2021 Sun 17:21
  • ఇటీవల కరోనా బారినపడిన సోమిరెడ్డి
  • స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్న నేత
  • పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేరిక
  • అందరి ఆశీస్సులతో కోలుకున్నానని వెల్లడి
  • త్వరలోనే అందరి ముందుకు వస్తానంటూ ట్వీట్
TDP leader Somireddy discharges from hospital

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ఇటీవలే కరోనా బారినపడ్డారు. స్వల్పంగా కొవిడ్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ఆసుపత్రిలో చేరారు. తాజాగా, కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ విషయాన్ని సోమిరెడ్డి స్వయంగా వెల్లడించారు.

"మీ అందరి ఆశీస్సులతోనూ, పూజలు, ప్రార్థనలతోనూ కరోనా నుంచి కోలుకుని ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. డాక్టర్ల సలహా పాటిస్తూ రెండు వారాల పాటు హోం క్వారంటైన్ లో ఉంటాను. పూర్తిగా ఆరోగ్యవంతుడ్నయ్యాక నేను మీ వద్దకు వస్తాను. నా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న అందరికీ ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేశారు.