16 నుంచి వ్యాక్సినేష‌న్.. రేపు సీఎంల‌తో మోదీ కీల‌క స‌మావేశం

10-01-2021 Sun 13:13
  • వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు ఏర్పాట్లు పూర్తి
  • రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చ‌ర్చ‌
  • డ్రైరన్‌పై వివ‌రాలు తెలుసుకోనున్న మోదీ
modi meets cms tomorrow

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు కేంద్ర‌ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేష‌న్ ను మొద‌లు పెట్టాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడ‌నున్నారు.

ఆయా రాష్ట్రాలు వ్యాక్సినేష‌న్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన ఏర్పాట్ల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన వ్యాక్సిన్ డ్రైరన్‌పై కూడా మోదీ వివ‌రాలు తెలుసుకోనున్నారు. దేశంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై నిన్న కూడా మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొని అన్ని వివ‌రాలు తెలుసుకున్నారు.