చెన్నైలో భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తోన్న ర‌జ‌నీకాంత్ అభిమానులు

10-01-2021 Sun 12:09
  • రాజ‌కీయాల్లోకి రావాల‌ని డిమాండ్
  • రాజ‌కీయాల్లోకి రానంటూ చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని వ్యాఖ్య‌
  • వ‌ళ్లువార్ కొట్ట‌మ్‌లో జ‌రుగుతోన్న ప్ర‌ద‌ర్శ‌న
rajni fans rally in chennai

సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని, కొత్త ఏడాది కొత్త పార్టీ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించి మ‌ళ్లీ యూట‌ర్న్  తీసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ఆయ‌న‌ రాజ‌కీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆయ‌న అభిమానులు భారీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తున్నారు.  

రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని ఆయ‌న తీసుకున్న నిర్ణయంపై మ‌రోసారి ఆలోచించాల‌ని కోరుతున్నారు. క్రియాశీల రాజ‌కీయాల్లోకి రానంటూ ఆయ‌న ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని వారు అంటున్నారు.

చెన్నైలోని వ‌ళ్లువార్ కొట్ట‌మ్‌లో జ‌రుగుతోన్న‌ ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వంద‌లాది మంది ర‌జినీకాంత్ అభిమానులు పాల్గొని ఆ డిమాండ్ చేస్తున్నారు. త‌మిళ‌నాడులోని  పలు చోట్ల కూడా అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రజిన మక్కల్ మండ్రమ్ తరఫున ఎవరూ ఆందోళనలో పాల్గొనకూడదని ఆ సంఘం చెప్పిన‌ప్ప‌టికీ వారు విన‌ట్లేదు.