బ‌ర్డ్ ఫ్లూను రైతులే వ్యాపింపజేస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు

10-01-2021 Sun 11:43
  • దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభణ ‌
  • ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న తెలుపుతూ వ్యాప్తి చేస్తున్నారు
  • వారు అక్క‌డ హాయిగా కూర్చొని చికెన్ తింటున్నారు
  • వారు వ‌చ్చింది ఆందోళ‌నకు కాదు.. పిక్నిక్ కు
farmers only reason for bird flu

దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ విజృంభిస్తోన్న విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో చికెన్, గుడ్ల ధ‌ర‌లు ప‌డిపోతున్నాయి. అయితే, బ‌ర్డ్ ఫ్లూకు కార‌ణం రైతులేనంటూ  బీజేపీ నేత వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన నూతన వ్యవసాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద రైతులు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తోన్న నేప‌థ్యంలో రాజస్థాన్‌కు చెందిన నేత, బీజేపీ ఎమ్మెల్యే దిలావర్ మాట్లాడుతూ... ఆందోళనకు దిగిన రైతులు అక్కడే చికెన్ తింటున్నార‌ని, దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపింపజేస్తున్నారని అన్నారు.

దొంగలు, ఉగ్రవాదుల్లా రైతులు ప్రవర్తిస్తున్నారంటూ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వారు దేశం గురించి ఆందోళన చెందడం లేదని అన్నారు. ఆందోళ‌న‌లో కూర్చొని హాయిగా రుచిక‌ర‌ వంటకాలు తింటూ, పిక్నిక్ చేసుకుంటున్నారని చెప్పారు. చికెన్ బిర్యానీ, కాజూ, బాదం వంటి వాటిని తింటూ హాయిగా అక్క‌డ గ‌డుపుతున్నార‌ని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల‌ని ఆందోళ‌న చేస్తున్న‌ రైతులను అక్క‌డి నుంచి ఖాళీ చేయించాల‌ని అన్నారు. లేదంటే బర్డ్ ప్లూ పెద్ద సమస్యగా మారుతుంద‌ని చెప్పారు.