Petrol: 20 ఏళ్ల తరువాత... ఇండియాలో తగ్గిన ఇంధన వినియోగం!

  • 1999లో వినియోగించిన స్థాయి
  • పెట్రోలుకు తగ్గిన 10.8 శాతం డిమాండ్
  • లాక్ డౌన్, కరోనాలే కారణం
Crude Demand Declain in India after 20 Years

ఇండియాలో దాదాపు రెండు దశాబ్దాల తరువాత పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గింది. గత సంవత్సరం కుదేలు చేసిన కరోనా మహమ్మారి కారణంగానే ఇది సంభవమైంది. లాక్ డౌన్ వల్ల వాహనాలు కొన్ని నెలల పాటు రోడెక్కలేదన్న విషయం తెలిసిందే. ఇక చమురు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాధమిక గణాంకాలను బట్టి, 2019తో పోలిస్తే, పెట్రోలియం డిమాండ్ 10.8 శాతం తగ్గింది. కేవలం 193.4 మిలియన్ టన్నుల ఇంధనం మాత్రమే వినియోగమైంది. ప్రపంచంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ను వినియోగిస్తున్న దేశాల్లో ఒకటైన ఇండియాలో 1999 తరువాత ఇంత తక్కువ ఇంధనాన్ని వాడటం ఇదే తొలిసారి.

మార్చి తరువాత ఇంధన వినియోగం 70 శాతం తగ్గింది. పెట్రోకెమికల్ ప్లాంట్లలో సైతం క్రూడాయిల్ శుద్ధి కార్యకలాపాలు కొంత కాలం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ ముగిసిన తరువాత కూడా... అంటే డిసెంబర్ లో సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఇంధన డిమాండ్ 1.8 శాతం తగ్గడం గమనార్హం.

More Telugu News