సింగ‌ర్ సునీత మెడ‌లో మూడు ముళ్లు వేసిన‌ రామ్ వీర‌ప‌నేని

10-01-2021 Sun 09:32
  • శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో వివాహం
  • కొద్ది మంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో పెళ్లి
  • హాజ‌రైన తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి  
singer sunita gets married

మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనితో సింగ‌ర్ సునీత వివాహం నిన్న రాత్రి నిరాడంబ‌రంగా జరిగింది. శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో వీరి వివాహం జ‌రిగింది. సునీత మెడ‌లో రామ్ వీర‌ప‌నేని మూడు ముళ్లు వేశారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో ఈ వేడుక‌కు కొద్ది మంది బంధుమిత్రులు మాత్ర‌మే వ‌చ్చారు. ప‌లువురు  సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.  సునీత పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తెలంగాణ‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా సునీత వివాహానికి హాజ‌రై వ‌ధూవ‌రులను ఆశీర్వ‌దించారు. హీరో నితిన్ దంపతులు కూడా వీరి పెళ్లికి హాజరయ్యారు. కాగా, సునీత, రామ్‌ ఇద్ద‌రికీ ఇది రెండో పెళ్లి. సింగ‌ర్ సునీతకు 19 ఏళ్ల‌ వ‌య‌సులోనే వివాహం జ‌ర‌గ‌గా భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో విడాకులు ఇచ్చారు.