India: ఎంతో శ్రమించి స్మిత్ వికెట్ తీసిన ఇండియా... 300 దాటిన ఆసీస్ లీడ్!

  • 81 పరుగుల వద్ద స్మిత్ అవుట్
  • ఎల్బీగా పెవీలియన్ కు పంపిన అశ్విన్
  • 323 పరుగులకు చేరుకున్న ఆసీస్ లీడ్
Above 300 Lead for Australia in Third Test

సిడ్నీలో జరుగుతున్న మూడవ టెస్ట్ లో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన స్టీవ్ స్మిత్ ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో, ఆస్ట్రేలియా ఐదో వికెట్ ను కోల్పోయింది. అయినప్పటికీ భారత్ విజయావకాశాలను దెబ్బతీస్తూ, ఆసీస్ లీడ్ 300కు పైగా చేరుకుంది.

నిన్న రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ 13, పుకోవిస్కీ 10, లబూస్ చేంజ్ 73, మ్యాథ్యూ వేడ్ 4, స్టీవ్ స్మిత్ 81 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ప్రస్తుతం కామెరాన్ గ్రీన్ 25, టిమ్ పెయినీ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టులో సిరాజ్ కు 1, నవదీప్ శైనీ, రవిచంద్రన్ అశ్విన్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.

ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 229 పరుగులకు చేరగా, మొత్తం లీడ్ 323 పరుగులకు చేరుకుంది. లంచ్ విరామం తరువాత ఆసీస్ జట్టు తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, నేడు కనీసం 20 ఓవర్లకు పైగా ఇండియాకు ఆడే అవకాశం ఇచ్చి, సాధ్యమైనన్ని వికెట్లను తీయాలన్న వ్యూహంతో ఉంది. ఆపై ఆట మరో రోజు కూడా ఉండటంతో ఈ మ్యాచ్ లో ఓటమిని తప్పించుకోవాలంటే భారత జట్టులో కనీసం నలుగురైనా రాణించి క్రీజులో గంటల కొద్దీ పాతుకుపోవాల్సి వుంటుంది.

More Telugu News