యాదాద్రిలో రెండు పుష్కరణిలు... కింద 2500 మంది స్నానం చేసేలా లక్ష్మీ పుష్కరిణి!

10-01-2021 Sun 06:33
  • స్వామి కైంకర్యాల కోసం పైనుండే విష్ణు పుష్కరిణి
  • కింద ఉన్న గండి చెరువే లక్ష్మి పుష్కరిణి
  • భక్తుల స్నానాలకు ఏర్పాట్లు
Two Pushkarinis in Yadadri

యాదగిరిగుట్టలో రెండు పుష్కరిణిలు ఏర్పాటు కానున్నాయి. కొండపై ఉండే విష్ణు పుష్కరిణిని స్వామివారి కైంకర్యాల కోసం మాత్రమే వినియోగిస్తూ, భక్తుల పుణ్య స్నానాల నిమిత్తం కొండ దిగువన ఉన్న గండి చెరువును పుష్కరిణిగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గండి చెరువుకు లక్ష్మీ పుష్కరిణిగా నామకరణం చేసిన ప్రభుత్వం, రెండు పుష్కరుణల వద్దా వాటి పేర్లతో కొత్త బోర్డులను ఏర్పాటు చేయించనుంది.

కొండ దిగువన ఉండే పుష్కరిణిలో ఒకేసారి 2,500 మంది వరకూ భక్తులు స్నానాలు చేయవచ్చని వెల్లడించిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ గీతారెడ్డి, మహిళలు, పురుషులు, పిల్లల కోసం వేర్వేరు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక్కడే జల్లు స్నానాలకు, దుస్తులను మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లను సైతం నిర్మిస్తున్నట్టు తెలిపారు.