తెలంగాణ హైకోర్టులో అగ్నిప్రమాదం... సకాలంలో స్పందించిన సిబ్బంది

09-01-2021 Sat 21:25
  • కోర్టు పరిపాలన భవనంలో మంటలు
  • మంటల్ని అదుపులోకి తెచ్చిన సెక్యూరిటీ సిబ్బంది
  • ఊపిరి పీల్చుకున్న కోర్టు వర్గాలు
Fire broken out in Telangana High Court

తెలంగాణ హైకోర్టులో పెను ప్రమాదం తప్పింది. హైకోర్టు పరిపాలనా భవనంలో మంటలు చెలరేగాయి. అయితే, కోర్టు భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. మంటలను సమర్థంగా అదుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. దీనిపై కోర్టు వర్గాలు స్పందించాల్సి ఉంది.