వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి... పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం

09-01-2021 Sat 20:52
  • పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వకీల్ సాబ్
  • గుమ్మడికాయ కొట్టేసిన చిత్రబృందం
  • వచ్చే వేసవిలో రిలీజ్ కానున్న వకీల్ సాబ్
  • ఈ నెల 14న టీజర్
 Vakeel Saab shooting completed

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. చిత్రయూనిట్ తాజాగా గుమ్మడికాయ కొట్టేసింది. ఇటీవలే పవన్ పై సన్నివేశాల చిత్రీకరణ కూడా ముగిసింది. ఆ తర్వాత ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు శ్రీరామ్ వేణు ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పై దృష్టి సారించారు. ఈ వేసవి నాటికి వకీల్ సాబ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బోనీ కపూర్ సమర్పకుడు. ఇందులో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయిక. వకీల్ సాబ్ మాతృక 'పింక్'లో అమితాబ్ బచ్చన్ కు కథానాయిక లేకపోయినా, పవన్ ఇమేజ్ దృష్ట్యా కథలో కొద్దిగా మార్పులు చేసి హీరోయిన్ పాత్ర తీసుకువచ్చారు. ఇక, కథకు కీలకమైన పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. జనవరి 14న వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.